Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

అంబేద్కర్ జయంతి వేడుకల్లో చంద్రకుమార్‌కు ఘన సత్కారం

14-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆలేరు:భారత రాజ్యాంగ శిల్పి,మహానీయ సామాజిక విప్లవకారుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆలేరు పట్టణంలో స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.క్లబ్ అధ్యక్షులు పూల నాగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.ఈ కార్యక్రమానికి ఆలేరు శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం మాట్లాడిన వారు “అంబేద్కర్ హమారేహే” అంటూ నినాదాలు చేస్తూ ఆయన ఆశయాలను సాధించేందుకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా క్లబ్ సహాయ కార్యదర్శి,జాతీయ క్రీడాకారుడు పూల చంద్రకుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని ఎమ్మెల్యే చేతుల మీదుగా కేకు కట్ చేయించి శాలువతో ఘనంగా సత్కరించారు.అలాగే క్లబ్ తరఫున చైర్మన్‌లు,కౌన్సిలర్లు,ఇతర అతిథులను కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగా శాలువాలతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి,ఆలేరు మున్సిపల్ చైర్మన్ బిజినీ బాలమణి భాస్కర్,టీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి,ఉపాధ్యాయ రాష్ట్ర నాయకులు మంద సోమరాజు,మున్సిపల్ కౌన్సిలర్ మరియమ్మ మార్క,యాట శివ,పస్తం ఆంజనేయులు,మల్లెల శ్రీకాంత్,జూకంటి సంపత్,కాంగ్రెస్ నాయకులు ఎండి.ఎజాజ్,కట్టె కొమ్ముల సాగర్ రెడ్డి,మాజీ ఎంపీపీ అశోక్,మాజీ ఎంపీటీసీలు పిక్క శ్రీను,ఆరె ప్రశాంత్,క్లబ్ సభ్యులు పూల సూర్య కుమార్,అనిల్,రాహుల్ తేజ,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ జయంతి వేడుకల్లో చంద్రకుమార్‌కు ఘన సత్కారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News