మల్కాజిగిరి: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)లో HIV, TB సేవల పురోగతిని TGSACS అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఏ. రాజేశం సమీక్షించారు. మానిటరింగ్ అండ్ అసెస్‌మెంట్ ఆఫ్ సర్వీసెస్ (MAS)లో భాగంగా ఆస్పత్రిని సందర్శించిన ఆయన ICTC, CBNAAT కేంద్రాలు, బ్లడ్ బ్యాంక్‌లో సేవల అమలు తీరును పరిశీలించారు.
ICTCలో HIV పరీక్షలు, పాజిటివ్ కేసుల గుర్తింపు, ART సేవలకు అనుసంధానం, HIV-TB క్రాస్ రిఫరల్స్, ఫాలోఅప్ వివరాలను పరిశీలించారు. CBNAAT కేంద్రంలో HIV-TB సహవ్యాధి కేసుల చికిత్స, ఫాలోఅప్, వైరల్ లోడ్ పరీక్షలు, వైరల్ లోడ్ సప్రెషన్ పరిస్థితిపై ఆరా తీశారు. బ్లడ్ బ్యాంక్‌లో వాలంటరీ బ్లడ్ డొనేషన్, HIV స్క్రీనింగ్ వివరాలను పరిశీలించారు.
రెండో 95లో అంతరాన్ని తగ్గించాలి
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఇప్పటికే మొదటి, మూడో 95 లక్ష్యాలను సాధించిందని డా. రాజేశం తెలిపారు. రెండో 95 లక్ష్యాన్ని చేరుకునేందుకు గుర్తించిన PLHIVలను ART చికిత్సకు అనుసంధానం చేసి, చికిత్స కొనసాగింపు, ఫాలోఅప్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రైవేట్ ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థలను సందర్శించి ART చికిత్స పొందుతున్న PLHIV వివరాలను సేకరించాలని, అవసరమైన వారిని సంబంధిత సేవలకు అనుసంధానం చేయాలని జిల్లా బృందానికి సూచించారు. ఖచ్చితమైన డాక్యుమెంటేషన్, సమయానుకూల రిఫరల్స్, ఆస్పత్రుల మధ్య సమన్వయం, నిరంతర ఫాలోఅప్‌తో HIV-TB సేవలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బాబు రావు, డా. వై. శ్రీదేవి, డా. రాధ, డా. మాధురి, డా. పి. వినోద్, సంజీవ్, రమేష్, కల్పనతో పాటు TB కార్యక్రమ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి