Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:38 AM

8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నాగేష్ షేట్కార్ నామినేషన్ దాఖలు

29-01-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున 8వ వార్డుకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ సహకారంతో కౌన్సిలర్ అభ్యర్థిగా మాజీ ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్ ఈరోజు (గురువారం) అధికారికంగా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.ఈ సందర్భంగా నాగేష్ షేట్కార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాలు, సూచనల మేరకు తాను నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే 8వ వార్డులోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడమే తన ప్రధాన లక్ష్యమని నాగేష్ షేట్కార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.ఈ నామినేషన్ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నాగేష్ షేట్కార్ సంఘీభావం తెలిపారు.8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన పోటీ ఉండనుందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Sthanikam

8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నాగేష్ షేట్కార్ నామినేషన్ దాఖలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News