Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:29 PM

69వ రాష్ట్రస్థాయి అండర్–17 క్రికెట్ పోటీలకు షేక్ అర్హన్ ఎంపిక

69వ రాష్ట్రస్థాయి అండర్–17 క్రికెట్ పోటీలకు షేక్ అర్హన్ ఎంపిక

69వ రాష్ట్రస్థాయి అండర్–17 క్రికెట్ పోటీలకు షేక్ అర్హన్ ఎంపిక
February 12, 2026 06:23 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

69వ రాష్ట్రస్థాయి అండర్–17 క్రికెట్ పోటీలకు షేక్ అర్హన్ ఎంపిక

స్కూల్ గేమ్ ఫెడరేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13 నుండి 16 వరకు జడ్చర్ల వేదికగా నిర్వహించబడుతున్న 69వ రాష్ట్రస్థాయి అండర్–17 క్రికెట్ పోటీలలో పాల్గొనే ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీ కి చెందిన ప్రతిభావంతుడైన క్రీడాకారుడు షేక్ అర్హన్ ఎంపికైనట్లు కోచ్ సిద్ధిఖ్ తెలిపారు. అర్హన్ తన క్రమశిక్షణ, పట్టుదల, కఠిన సాధనతో ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో నియమిత ప్రాక్టీస్ చేస్తూ తన ఆటను మెరుగుపరుచుకుంటున్నాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్‌లో ప్రత్యేక నైపుణ్యం సాధించేందుకు రన్-అప్ కంట్రోల్, లైన్ అండ్ లెంగ్త్, యార్కర్లు, బౌన్సర్లు వంటి బౌలింగ్ మెళుకువలను సాధన చేస్తున్నాడు. అదనంగా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ స్ప్రింట్స్, స్టామినా ట్రైనింగ్, జిమ్ వర్కౌట్స్, ఫీల్డింగ్ డ్రిల్స్ వంటి వ్యాయామాలతో శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకున్నాడు. మ్యాచ్ పరిస్థితులను ఎదుర్కొనే మానసిక ధైర్యం ఆత్మవిశ్వాసం కూడా అలవర్చుకున్నాడు. ఈ విజయానికి అకాడమీ కోచ్ షేక్ అబూబకర్ సిద్దిఖ్ శిక్షణ, మార్గదర్శనం, నిరంతర ప్రోత్సాహం ప్రధాన కారణమని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రస్థాయిలో అర్హన్ ఉత్తమ ప్రదర్శన చేసి జిల్లా, అకాడమీకి మంచి పేరు తీసుకురావాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. తల్లిదండ్రులు అతనిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్, మండల విద్యాశాఖ అధికారి మొహమ్మద్ సలీం షరీఫ్,

కోదాడ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఖాజా మియా, తుమ్మల సురేష్, మీరా, డాక్టర్స్ క్రికెట్ జట్టు కోదాడ రాయల్స్ క్రీడాకారులు డాక్టర్ నందకిషోర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ దిలీప్, డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ వినయ్, డాక్టర్ విజయ్, డాక్టర్ కలాం, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సాంబ, డాక్టర్ వెంకటేష్, అసోసియేషన్ సభ్యులు నాయిని నాగేశ్వరరావు, జబ్బార్, శ్రీకాంత్, బాలరాజు, బుల్లయ్య, శ్రీను తదితరులు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News