హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్‌ఎంసీ అనుమతులుంటే రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌సిగ్నల్.
22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ అనుమతులతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని ఆస్తులకు రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
22ఏ నిషేధిత జాబితాలో ఆస్తులు చేరడంతో కొంతకాలంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న యజమానులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. ముఖ్యంగా ఇప్పటికే సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థల అనుమతులతో లేఅవుట్లు అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఇదే సమయంలో 22ఏకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సీసీఎల్‌ఏ ఆధ్వర్యంలోని ఈ కమిటీ పెండింగ్ కేసులను పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించనుంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి