కోదాడ పట్టణంలోని 21వ వార్డు శ్రీమన్నారాయణ కాలనీలో గణేష్ నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు.
ఈ సందర్భంగా యువత, మహిళలు, చిన్నారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. భక్తిగీతాలు, నృత్యాలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలోబచ్చు సైదారావు, వి శ్రీనివాస్ రెడ్డి,, విశ్వనాదుల సతీష్,ఎం రంగారావు శ్రీనివాసరావు,మల్లం రమేష్, వేమూరి సతీష్,, మార్కపుడి రామకృష్ణ,బాదే రామలింగయ్య, చల్లా ప్రవీణ్,ఆవుల శివప్రసాద్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి