Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:19 AM

15వ వార్డులో బిఆర్ఎస్ జెండా ఎగురవేసిన రుబినా బేగం నజీబ్

13-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 15వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి రుబినా బేగం నజీబ్ 124 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై సాధించిన ఈ గెలుపుతో బిఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది.ఫలితాలు వెలువడిన వెంటనే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.వార్డు ప్రజలు అభినందనలు తెలియజేస్తూ విజేతను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలను ఇంటింటికీ వెళ్లి తెలుసుకుని,పరిష్కారానికి కట్టుబడి ఉంటానని ఇచ్చిన హామీకి ప్రజలు మద్దతు ఇచ్చారని నాయకులు తెలిపారు.విజయం అనంతరం మాట్లాడిన రుబినా బేగం నజీబ్, తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రతి ఓటరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 15వ వార్డులో తాగునీరు,రహదారులు,పారిశుధ్యం,వీధి దీపాలు వంటి ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ప్రజల సహకారంతో వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ విజయంతో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.

Sthanikam

15వ వార్డులో బిఆర్ఎస్ జెండా ఎగురవేసిన రుబినా బేగం నజీబ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News