ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి, చైర్పర్సన్ పావని రమేష్ సహకారంతో ఏర్పాటు
దివిస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్
స్థానిక పురపాలక సంఘం పరిధిలోని 14వ వార్డు ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం నూతనంగా బోరుబావిని తవ్వించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొగదాల పావని రమేష్ గౌడ్ ఆదేశాల మేరకు, దివిస్ పరిశ్రమ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం 14వ వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్, కో-ఆప్షన్ సభ్యురాలు సందగల్ల విజయ సతీష్‌ల పర్యవేక్షణలో బోరు తవ్వకం పనులను పూర్తి చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ జ్యోతి రమేష్ మాట్లాడుతూ.. 14వ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్‌తో పాటు ఉచితంగా బోరు వేయించిన దివిస్ యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో ఏ విధమైన సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరూ కలిసికట్టుగా ఉంటూ 14వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు వర్కాల రవిగౌడ్, కామిశెట్టి చంద్రశేఖర్, ఓరుగంటి భానుగౌడ్, మండలోజు శ్రీధర్ చారి, ఎస్కే మున్నా, రాజపేట యాదగిరి చారి, ఉడుగు కృష్ణ, ఎస్కే జహీర్, మలిగే శ్రీను, ఉడుగు నరసింహ, వర్కాల శివ, ఉడుగు నవీన్, ఉడుగు సాయికుమార్, మండలోజు మనోజ్ చారి, వర్కాల లలిత, వర్కాల భాను, వర్కాల వెన్నెల, పద్మ, వర్కాల మంజుల, వర్కాల పద్మ, రాజపేట రమాదేవి, ఓరుగంటి ఇందిర, చిలువేరు జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి