Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:54 PM

108 శ్రీ శ్రీ శ్రీ శివయోగి శివచార్య స్వాముల జన్మదిన వేడుకల్లో ఖేఢ్ యూత్ కాంగ్రెస్ నాయకుల సందడి

108 శ్రీ శ్రీ శ్రీ శివయోగి శివచార్య స్వాముల జన్మదిన వేడుకల్లో ఖేఢ్ యూత్ కాంగ్రెస్ నాయకుల సందడి

108 శ్రీ శ్రీ శ్రీ శివయోగి శివచార్య స్వాముల జన్మదిన వేడుకల్లో ఖేఢ్ యూత్ కాంగ్రెస్ నాయకుల సందడి
March 23, 2026 12:50 AM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివాపేట మండల పరిధిలోని గాల తంగేడుపల్లి గ్రామ శివారులో గల గంగాధర్ స్వామి మఠం, జంగమ్మయ్య గుట్టలో ఉన్న గాల కోటిబిళవ లింగేశ్వర్ ఆలయంలో పీఠాధిపతి 108 శ్రీ శ్రీ శ్రీ శివయోగి శివచార్య స్వాముల వారి 31వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించి,భక్తులు భారీగా హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.ఈ వేడుకల్లో నారాయణఖేడ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివకాంత్ పటేల్, తొర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేష్ పటేల్, దుదగొండ ఉప సర్పంచ్ అనిల్ పటేల్, అలాగే అరుణ్ తదితర నాయకులు పాల్గొన్నారు. స్వామివారికి శేష వస్త్రం సమర్పించి, పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు స్వామివారి ఆశీస్సులు తీసుకుని, ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధి కోసం తమ కృషి కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News