Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:27 AM

యుద్ధకళలతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపు

యుద్ధకళలతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపు

యుద్ధకళలతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపు
22-12-2025 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హుడా పార్క్‌లో కుంగ్ ఫు బెల్ట్ అప్‌గ్రేడేషన్ విజయవంతం

స్థానికం ప్రతినిధి

షావోలిన్ టైగర్స్ కుంగ్ ఫు ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మాస్టర్ కన్నన్ గౌడ్ చేతుల మీదుగా హుడా పార్క్, డా. ఎ.ఎస్. రావు నగర్‌లో కుంగ్ ఫు బెల్ట్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

ఈ సందర్భంగా కోచ్ కన్నా గౌడ్ మాట్లాడుతూ, పిల్లలకు చదువుతో పాటు కరాటే/కుంగ్ ఫు వంటి యుద్ధకళలు నేర్చుకోవడం ఆత్మరక్షణకు ఎంతో అవసరమని తెలిపారు. కుంగ్ ఫు సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందని, జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో బెల్ట్ అప్‌గ్రేడ్ పొందిన విద్యార్థులు హన్నెన్, వైభవ్, అఫ్షిన్, జోర్డన్జా, జాహ్నవ, వైశాలి, ఏకం, వైభవ్, భాను, ఓంప్రకాశ్, పాషా తదితరులు. విద్యార్థుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి విశేష స్పందన లభించగా, నిర్వాహకులు భవిష్యత్తులో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Sthanikam

యుద్ధకళలతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News