Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

విదేశీ గడ్డ నుంచి పుట్టింటికి.. పండుగ వేళ కుటుంబంలో కొత్త కళ!

Updated : 09 Nov 2026 18:54 IST
As Preferred Source 1 min read
విదేశీ గడ్డ నుంచి పుట్టింటికి.. పండుగ వేళ కుటుంబంలో కొత్త కళ!

కోదాడ పట్టణంలోని గోపిరెడ్డి నగర్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావెళ్ల కృష్ణారావు ఇంట దీపావళి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయన కుమార్తె లండన్ నుంచి స్వదేశానికి రావడంతో ఈసారి పండుగకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది.కుమార్తె రాకతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందరూ కలిసి దీపాలు వెలిగిస్తూ, టపాసులు కాలుస్తూ ఉల్లాసంగా గడిపారు.చాలా రోజుల తర్వాత కుటుంబమంతా ఒకచోట చేరి పండుగ జరుపుకోవడంతో ఇంట్లో సందడి నెలకొంది. విదేశాల్లో ఉన్నా కుటుంబ బంధాలకు ఉన్న విలువను చాటుతూ, ఆత్మీయ పలకరింపులు,ఆనంద క్షణాల మధ్య దీపావళి వేడుకలు మధుర జ్ఞాపకాలుగా మిగిలాయి.

Sthanikam

విదేశీ గడ్డ నుంచి పుట్టింటికి.. పండుగ వేళ కుటుంబంలో కొత్త కళ!

Article Image

కోదాడ పట్టణంలోని గోపిరెడ్డి నగర్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావెళ్ల కృష్ణారావు ఇంట దీపావళి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయన కుమార్తె లండన్ నుంచి స్వదేశానికి రావడంతో ఈసారి పండుగకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది.కుమార్తె రాకతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందరూ కలిసి దీపాలు వెలిగిస్తూ, టపాసులు కాలుస్తూ ఉల్లాసంగా గడిపారు.చాలా రోజుల తర్వాత కుటుంబమంతా ఒకచోట చేరి పండుగ జరుపుకోవడంతో ఇంట్లో సందడి నెలకొంది. విదేశాల్లో ఉన్నా కుటుంబ బంధాలకు ఉన్న విలువను చాటుతూ, ఆత్మీయ పలకరింపులు,ఆనంద క్షణాల మధ్య దీపావళి వేడుకలు మధుర జ్ఞాపకాలుగా మిగిలాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి