జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.
యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్ 9 స్థానికం ప్రతినిధి:
గుజరాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం కల్పించినందుకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి సర్పంచ్‌ల బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు కలెక్టర్‌తో పాటు సంబంధిత జిల్లా అధికారులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించింది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలకు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గ్రామాభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఐదుగురు సర్పంచ్‌లకు ఆహ్వానం అందింది. వీరిలో భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్, శ్రీనివాస్ దంపతులు కూడా ఉన్నారు. వారు జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొని జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ అవకాశానికి సహకరించిన కలెక్టర్ అనురాగ్ జయంతికి, జిల్లా అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసేవకు గుర్తింపు లభించడం ప్రజాప్రతినిధులకు మరింత ఉత్సాహాన్ని, బాధ్యతను పెంచుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి