మునగాల మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ ఇటీవల అకాల మరణం పొందిన కే. సైదులు కుటుంబానికి తోటి ఉపాధ్యాయులు,దాతలు,గ్రామ సర్పంచ్ ఆర్థికంగా అండగా నిలిచారు. వీరంతా కలిసి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఇందులో పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఇతర దాతలు రూ.40 వేలు,గ్రామ సర్పంచ్ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ రూ.10 వేలు అందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కె.వీరబాబు మాట్లాడుతూ.. సైదులు మృతి పాఠశాల కుటుంబానికి తీరని లోటని, ఆయన కుటుంబానికి కష్టకాలంలో తోడుగా నిలవడం తమ బాధ్యతగా భావించామని తెలిపారు. తోటి ఉపాధ్యాయుడి కుటుంబానికి అండగా నిలిచిన దాతలు,సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణ, రవీందర్ రెడ్డి, సుబ్రమణ్యం,రమేష్ తదితరులు పాల్గొన్నారు..
తోటి ఉపాధ్యాయుడి కుటుంబానికి రూ.50 వేల చేయూత
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి