కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ విద్యా నిలయంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్-14, అండర్-17 బాలబాలికల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్,సెలక్షన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ పోటీలను ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, బీకేఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు బద్దం భద్రారెడ్డి, ఏసీఎఫ్ కార్యదర్శి కిరణ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే తత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు తదుపరి స్థాయి పోటీల్లో అవకాశం కల్పించనున్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తునం కృష్ణ, క్రీడా ప్రతినిధులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
కోదాడలో జిల్లా స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు శ్రీకారం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి