Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

కీసర పోలీస్‌స్టేషన్‌లో మరో లంచం కేసు.

Updated : 09 Nov 2026 19:00 IST
As Preferred Source 1 min read
కీసర పోలీస్‌స్టేషన్‌లో మరో లంచం కేసు.

రూ.2 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన ఎస్‌ఐ శ్రీనివాస్.

ఒకే స్టేషన్‌లో వరుస అవినీతి ఘటనలు.. పోలీస్‌శాఖలో కలకలం.

కీసర నవంబర్ 9 స్థానికం ప్రతినిధి:

కీసర పోలీస్‌స్టేషన్‌లో మరో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఓ కేసులో చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచంగా డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌.. అదే మొత్తాన్ని తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడినట్లు తెలుస్తోంది.

ఇటీవల ఇదే పోలీస్‌స్టేషన్‌లో సీఐ లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన మరువకముందే మరో అధికారి లంచం ఆరోపణలతో ఏసీబీకి చిక్కినట్లు సమాచారం రావడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఒకే పోలీస్‌స్టేషన్‌లో వరుసగా అవినీతి ఘటనలు వెలుగులోకి రావడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీస్‌శాఖలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

కీసర పోలీస్‌స్టేషన్‌లో మరో లంచం కేసు.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి