Sthanikam - Truth Matters
Logo

వేతనాల పెంపు కోసం ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్ల ఆందోళన

Updated : 31 Oct 2026 18:26 IST
As Preferred Source 1 min read
వేతనాల పెంపు కోసం ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్ల ఆందోళన

మూడు గంటల పాటు బస్సులు నిలిపివేత.. నవంబర్ 4న యాజమాన్యంతో చర్చలకు హామీ.

వేతనాలు పెంచాలని, యాజమాన్యం వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే విధులను నిలిపివేసి నిరసన చేపట్టారు. దీంతో సుమారు మూడు గంటల పాటు ఎలక్ట్రిక్ బస్సుల సేవలకు అంతరాయం ఏర్పడింది.

జేబీఎం సిస్కాన్ మ్యాన్‌పవర్ సంస్థ ప్రతినిధులు యూనియన్ ఏర్పాటు చేసుకున్నారనే కారణంతో డ్రైవర్లను వేధిస్తున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. గత 16 నెలలుగా విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట, వరంగల్ డిపోల్లో డ్రైవర్లకు నెలకు రూ.26 వేల వేతనం చెల్లిస్తుండగా, నల్లగొండలో మాత్రం రూ.20 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధులు నిలిపివేసిన సోమయ్య, మురళి, కృష్ణారెడ్డితో పాటు మరో 15 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

డ్రైవర్ల ఆందోళనకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం మద్దతు తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్యతో పాటు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ డిపో అధ్యక్షుడు కాసాన్ రమేష్, కార్యదర్శి పొట్టపాంగి గణేష్, కోశాధికారి పూల సోమన్న నాయుడు, ఉపాధ్యక్షుడు సింగపంగా మురళి, మచ్చ నాగార్జున, జల్లుల వీరారెడ్డి, బొడ్డుపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.డ్రైవర్ల డిమాండ్లపై సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ నవంబర్ 4న యాజమాన్యంతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వేతనాల పెంపుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో డ్రైవర్లు మూడు గంటల అనంతరం ఆందోళన విరమించి తిరిగి విధుల్లో చేరారు.

Sthanikam

వేతనాల పెంపు కోసం ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్ల ఆందోళన

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి