*తెలంగాణ
ఏక్తాదివస్ ను పురస్కరించుకుని దేశ ఐక్యత, అఖండతను కాపాడతామని అధికారులు మరియు సిబ్బంది ప్రతిజ్ఞ.
భారత మొదటి ఉప ప్రధాని దివంగత సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు హైదరాబాద్ బస్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ ఈడీ సిహెచ్.వెంకన్న , పలువురు అధికారులు వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఈడీ సిహెచ్.వెంకన్న మాట్లాడుతూ భారతదేశ మొదటి ఉప ప్రధాని , హోంమంత్రిగా దేశ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపు నిచ్చారు.
స్వాతంత్య్రానంతరం సుమారు 560కి పైగా ఉన్న స్వదేశీ సంస్థానాలను ఎటువంటి రక్తపాతం లేకుండా భారత యూనియన్‌లో విలీనం చేయడంలో ఆయన చూపిన అసాధారణ దౌత్యనీతి, దృఢ సంకల్పం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగిందని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చి 'ఉక్కు మనిషి గా ఖ్యాతిగాంచిన ఆయన, ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ, పటిష్టమైన పరిపాలనా వ్యవస్థ ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారని ఈడీ వెంకన్న అన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని, దేశ ఐక్యత మరియు అఖండతను కాపాడతామని ఈసందర్భంగా అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈకార్యక్రమంలో ఎఫ్ఏ విజయపుష్ప, సిపిఎం ,సిటీఎం భీంరెడ్డి, ఈఈ రమేష్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి