రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలోని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ (HYA XVI)లోని QUALITY సంస్థ ఇంద్రపాలనగరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రెండు కంప్యూటర్లను అందజేసింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్లను అందించిన సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. నేటి ఆధునిక కాలంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమని, ఈ కంప్యూటర్లు వారి భవిష్యత్తుకు ఉపయోగపడతాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, పంచాయతీ కార్యదర్శి వి. నరేందర్, సంస్థ ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, మాజీ ఉపసర్పంచ్ గర్ధాస్ వెంకటేష్, మేకల నరేందర్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ల అందజేత. హైదరాబాద్ సంస్థకు సర్పంచ్ విక్రమ్ కృతజ్ఞతలు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి