Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ సతీష్ రెడ్డి

Updated : 31 Oct 2026 17:46 IST
As Preferred Source 1 min read
సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ సతీష్ రెడ్డి

మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

​చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా విస్తరిస్తున్నాయని, విద్యార్థులు ఆన్‌లైన్ వ్యవహారాలు, సోషల్ మీడియా వినియోగంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) డి. సతీష్ రెడ్డి సూచించారు. శనివారం చౌటుప్పల్ పట్టణంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం' నిర్వహించారు.​ఈ సందర్భంగా సీఐ సతీష్ రెడ్డి విద్యార్థులకు సైబర్ నేరాల స్వభావం, వాటి నుంచి రక్షణ పొందే మార్గాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్ మోసగాళ్లు రకరకాల మార్గాల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా ఖాతాల్లో వ్యక్తిగత సమాచారం, ఫోటోలను పంచుకునే సమయంలో జాగ్రత్త వహించాలని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ​ఓటీపీలు, బ్యాంకు వివరాలు, పిన్ నంబర్లు ఎవరికీ చెప్పకూడదని, ఒకవేళ దురదృష్టవశాత్తూ సైబర్ మోసానికి గురైతే వెంటనే సంబంధిత అధికారులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన పెంచుకోవడంతో పాటు తమ చుట్టుపక్కల వారిని కూడా అప్రమత్తం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ సతీష్ రెడ్డి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి