Sthanikam - Truth Matters
Logo

మద్దతు ధరతో తడిసిన ధాన్యాన్ని కొనాలి.

Updated : 31 Oct 2026 18:27 IST
As Preferred Source 1 min read
మద్దతు ధరతో తడిసిన ధాన్యాన్ని కొనాలి.

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి ప్రతి గింజను కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే శ్రీ చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణాంగానే కొనుగోలు కేంద్రాలలో రైతుల ధాన్యం తడిసిందని ఆయన ఆరోపించారు. శనివారం చిట్యాలలోని ఉరుమడ్ల రోడ్డులో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా అక్కడ శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యమే ధాన్యం తడవడానికి కారణమని అన్నారు. 20 రోజులుగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోస్తే పట్టించుకున్న వారు లేరని అన్నారు. గతంలో బిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనుగోళ్లపై ఒక ప్రణాళిక బద్ధంగా వ్యవహరించే వారిని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరేలోపే కొనుగోలు ఎలా చేయాలని ప్లానింగ్ ఉండేదని, కానీ ఈ నిర్లక్ష్యం సర్కారు కొనుగోలుపై ముందు చూపే లేదని ఆయన విమర్శించారు. దున్నపోతు మీద నీళ్లు పాడిన చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, రైతులు పండించిన కొద్దిపాటి ధాన్యాన్ని కూడా కొనే స్థితిలో లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.

గతంతో పోలిస్తే ఈసారి పంట దిగుబడి చాలా తగ్గిందని అయినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాని కారణంగా రైతులు అవస్థలు పడుతున్నారని, 15 నుండి 20 రోజులుగా కొనుగోలు కేంద్రాలలో తన ధాన్యం రాశులు పోసి, కుప్పలు కావాలి పడుకో లేక, పట్టాల కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి గెలిచిన అప్పటి నుండి ఢిల్లీకి చక్కర్లు కొట్టడంతోనే సరిపోతుందని రాష్ట్ర అభివృద్ధినీ రైతుల అవస్థలను పట్టించుకోవడంలేదని, తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తప్పుడు విధానాలతో ప్రజలను మోసం చేస్తున్నాడని *చిరుమర్తి లింగయ్య గారు* విమర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు చిరుమర్తి తో తమ బాధను వెలబోసుకున్నారు. ఒక్క అధికారి కూడా కొనుగోలు కేంద్రానికి వచ్చి తమను చూడలేదని, నిన్న కురిసిన వర్షానికి దాన్యం మొత్తం తడిచి కొట్టుకుపోయిందని, ఇక్కడ ఎలాంటి వసతులు ఏర్పాటు చేయలేదని వారు చిరుమర్తి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ మార్కెట్ చైర్మన్ జడల ఆది మల్లయ్య, సింగల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి,రెండో వార్డ్ కౌన్సిలర్ ఎస్కే షబానా అజీముద్దీన్,బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జమాన్ల శ్రీనివాస్ రెడ్డి, బొబ్బలి శివ శంకర్ రెడ్డి, జిట్ట బొందయ్య,ఆగు అశోక్ యాదవ్, రుద్రవరం యాదయ్య, సాయి రెడ్డి ప్రతాపరెడ్డి, కున్నూరు శంకర్, రుద్రారపు కృష్ణయ్య, నర్సిరెడ్డి,ఆవుల ఆనంద్, బులుగూరి సైదుల్, జిట్టా శేఖర్, చెరుకు బాలు,మేకల ఉమేష్, మద్ది మధు, సిలువేరు రిశ్వంత్, చింతపల్లి ప్రవీణ్,అఖిల్, మరియు కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది

Sthanikam

మద్దతు ధరతో తడిసిన ధాన్యాన్ని కొనాలి.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news