Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

బియ్యం ధరలపై కీలక నిర్ణయం.అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు.అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. చంద్రా రెడ్డి

Updated : 31 Oct 2026 18:16 IST
As Preferred Source 1 min read
బియ్యం ధరలపై కీలక నిర్ణయం.అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు.అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. చంద్రా రెడ్డి

నిర్ణయించిన గరిష్ట ధరలకే బియ్యం విక్రయించాలి

తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల బియ్యం విక్రయ ధరలపై కమిషనర్ గారితో జిల్లా మరియు రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. చంద్రా రెడ్డి తెలిపారు.

నిర్ణయించిన గరిష్ట విక్రయ ధరలు:

- తెలంగాణ BPT బియ్యం – కిలో రూ. 66

- తెలంగాణ సోనా బియ్యం – కిలో రూ. 74

- తెలంగాణ శ్రీరామగోల్డ్ బియ్యం – కిలో రూ. 79

రైస్ మిల్లర్లు, రైస్ ట్రేడర్లు, హోల్‌సేల్ డిపో నిర్వాహకులు, రిటైలర్లు నిర్ణయించిన గరిష్ట విక్రయ ధరలకు మించకుండా బియ్యం విక్రయించాలని అదనపు కలెక్టర్ సూచించారు. వినియోగదారుల నుంచి నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తాన్ని వసూలు చేయరాదని స్పష్టం చేశారు.

నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా అధిక ధరలకు బియ్యం విక్రయించినట్లు గుర్తించిన పక్షంలో సంబంధిత వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ప్రజలకు న్యాయమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉండేలా సంబంధిత వ్యాపారులు నిర్ణయాలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి కోరారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి