Sthanikam - Truth Matters
Logo

సర్దార్ పటేల్ ఆశయాలే జాతీయ సమైక్యతకు స్ఫూర్తి.

Updated : 31 Oct 2026 17:46 IST
As Preferred Source 1 min read
సర్దార్ పటేల్ ఆశయాలే జాతీయ సమైక్యతకు స్ఫూర్తి.

దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రత పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత : ఎస్పీ శరత్ చంద్ర పవార్.

ఉక్కు మనిషి, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన పటేల్, స్వాతంత్ర్యం అనంతరం సంస్థానాలను ఏకం చేసి సమైక్య భారత నిర్మాణానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలు, దేశం పట్ల అంకితభావం నేటి తరానికి ఆదర్శమన్నారు.

దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, అంతర్గత భద్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతని స్పష్టం చేశారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రజలంతా సోదరభావంతో మెలగాలని, శాంతిభద్రతలు, సామాజిక సామరస్యం, దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ ప్రజల భద్రతతో పాటు దేశ అంతర్గత భద్రతకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏవో శివప్రసాద్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

సర్దార్ పటేల్ ఆశయాలే జాతీయ సమైక్యతకు స్ఫూర్తి.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news