Sthanikam - Truth Matters
Logo

కేసుల్లో శిక్షల శాతం పెంచేలా సమన్వయంతో పనిచేయాలి

Updated : 31 Oct 2026 18:26 IST
As Preferred Source 1 min read
కేసుల్లో శిక్షల శాతం పెంచేలా సమన్వయంతో పనిచేయాలి

కోర్టు డ్యూటీ అధికారులకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచన

కేసుల విచారణలో నిందితులకు శిక్షలు పడే కన్విక్షన్ శాతాన్ని పెంచేలా కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచించారు.

శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రతి కేసులో సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు సకాలంలో కోర్టుకు సమర్పించేలా దర్యాప్తు అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సమన్లు, వారెంట్ల అమలులో జాప్యం లేకుండా, సాక్షులు సకాలంలో కోర్టుకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం కొనసాగిస్తూ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.కేసుల్లో నేర నిరూపణకు కృషి చేస్తూ కన్విక్షన్ శాతం పెంపులో ప్రతిభ కనబరిచిన అధికారులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, సీఐలు శ్రీను నాయక్, బీషన్న, సంబంధిత పోలీస్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

కేసుల్లో శిక్షల శాతం పెంచేలా సమన్వయంతో పనిచేయాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news