యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన బీఎస్ఎన్‌ఎల్ టెలికాం టెక్నీషియన్ పెరుమాండ్ల గోపాల్ పదవీ విరమణ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, ఉద్యోగులు, శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్–శంకరమ్మ దంపతులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
పెరుమాండ్ల గోపాల్ బీఎస్ఎన్‌ఎల్ సంస్థలో ఆరేళ్లపాటు, కాజువల్ మజ్దూర్‌గా 37 సంవత్సరాలు, అనంతరం గ్రూప్-సి విభాగంలో రెగ్యులర్ ఉద్యోగిగా విధులు నిర్వహించారు. టెలికాం టెక్నీషియన్‌గా మొత్తం 43 సంవత్సరాల సుదీర్ఘ సేవలందించి పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఆయన సేవలను పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎస్ఎన్‌ఎల్ ఏజీఎం భువనగిరి గురువయ్య, యూనియన్ నాయకులు పరిపూర్ణ చారి, నరేష్, ప్రభాకర్, జిల్లా కార్యదర్శులు తదితరులు హాజరై గోపాల్ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా గోపాల్ అందించిన సుదీర్ఘ సేవలను గుర్తుచేసుకుని అభినందనలు తెలిపారు.
బీఎస్ఎన్‌ఎల్ సంస్థకు 43 ఏళ్ల పాటు అంకితభావంతో సేవలందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఉద్యోగ జీవితంలో గోపాల్ అందించిన సేవలు, అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆయనకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం గోపాల్–శంకరమ్మ దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్‌ఎల్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి