నల్గొండ జిల్లా: దామచర్ల మండలం వీరభద్రపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో నిలిపి ఉంచిన ఆయిల్ ట్యాంకర్లకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది.
సమాచారం అందుకున్న వాడపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి