Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

అంగుళం సుద్ధ ముక్కపై కొమరం భీమ్ ప్రతిమ.. సూక్ష్మ కళాకారుడు నరేశ్ చారి అద్భుతం!

Updated : 22 Oct 2026 21:48 IST
As Preferred Source 1 min read
అంగుళం సుద్ధ ముక్కపై కొమరం భీమ్ ప్రతిమ.. సూక్ష్మ కళాకారుడు నరేశ్ చారి అద్భుతం!

సూక్ష్మ కళలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోదాడకు చెందిన కళాకారుడు నరేశ్ చారి మరోసారి తన అద్భుత ప్రతిభను చాటుకున్నారు. గిరిజనుల హక్కుల కోసం ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో పోరాడిన వీరుడు కొమరం భీమ్ జయంతిని పురస్కరించుకొని, గురువారం ఆయన ప్రతిమను కేవలం అంగుళం పరిమాణం ఉన్న సుద్ధ ముక్కపై అత్యంత నైపుణ్యంతో చెక్కారు.అతి చిన్న ప్రదేశంలో కొమరం భీమ్ రూపాన్ని స్పష్టంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ఆయన కళా ప్రతిభకు అద్దం పడుతోంది. సూక్ష్మమైన వివరాలను సైతం ఎంతో శ్రద్ధగా మలచి రూపొందించిన ఈ ప్రతిమ చూపరులను ఆకట్టుకుంటోంది. తన వినూత్న కళా నైపుణ్యంతో నరేశ్ చారి మరోసారి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

Sthanikam

అంగుళం సుద్ధ ముక్కపై కొమరం భీమ్ ప్రతిమ.. సూక్ష్మ కళాకారుడు నరేశ్ చారి అద్భుతం!

Article Image

సూక్ష్మ కళలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోదాడకు చెందిన కళాకారుడు నరేశ్ చారి మరోసారి తన అద్భుత ప్రతిభను చాటుకున్నారు. గిరిజనుల హక్కుల కోసం ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో పోరాడిన వీరుడు కొమరం భీమ్ జయంతిని పురస్కరించుకొని, గురువారం ఆయన ప్రతిమను కేవలం అంగుళం పరిమాణం ఉన్న సుద్ధ ముక్కపై అత్యంత నైపుణ్యంతో చెక్కారు.అతి చిన్న ప్రదేశంలో కొమరం భీమ్ రూపాన్ని స్పష్టంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ఆయన కళా ప్రతిభకు అద్దం పడుతోంది. సూక్ష్మమైన వివరాలను సైతం ఎంతో శ్రద్ధగా మలచి రూపొందించిన ఈ ప్రతిమ చూపరులను ఆకట్టుకుంటోంది. తన వినూత్న కళా నైపుణ్యంతో నరేశ్ చారి మరోసారి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి