సూక్ష్మ కళతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న కోదాడకు చెందిన కళాకారుడు నరేశ్ చారి ప్రతిభను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అభినందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, నరేశ్ చారి కేవలం అంగుళం పరిమాణం ఉన్న సుద్ధ ముక్కపై పోలీసు అమరవీరుల స్తూపం ప్రతిమను అద్భుతంగా చెక్కారు.గురువారం ఈ సూక్ష్మ కళాఖండాన్ని డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి అందజేశారు. అతి చిన్న సుద్ధ ముక్కపై అమరవీరుల స్తూపాన్ని ఎంతో నైపుణ్యంతో రూపొందించడం పట్ల డీఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. సూక్ష్మ కళ ద్వారా పోలీసు అమరవీరులకు నివాళులర్పించడం అభినందనీయమని పేర్కొంటూ నరేశ్ చారి కళా ప్రతిభను ప్రశంసించారు.
అంగుళం సుద్ధ ముక్కపై పోలీసు అమరవీరుల స్తూపం.. నరేశ్ చారి కళకు డీఎస్పీ ప్రశంసలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి