సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కోహిర్ మండలంలోని పిచరాగడి పాత తాండ గ్రామ పంచాయతీ ఆవరణలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు గురువారం భూమి పూజ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కోహిర్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ ప్రతినిధి రాథోడ్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన దళిత, గిరిజన సంఘాల నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని తొలి గిరిజన తాండలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధితో పాటు మహనీయుల ఆశయాలకు ప్రాధాన్యతనిస్తూ విగ్రహ ఏర్పాటుకు చొరవ తీసుకున్న రాథోడ్ వినోద్ కుమార్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తాండ మాజీ సర్పంచ్ చౌహన్ చందర్, వార్డు సభ్యులు రామావత్ నర్సింలు, రాథోడ్ సంజీవ్ కుమార్, సజ్జపూర్ ఉప సర్పంచ్ మైసయ్య, నాయకులు లోకనాధం, భ్యగారి అశోక్, టీ. సంజీవులు, ప్రకాష్, సచిన్‌తో పాటు పలువురు దళిత, గిరిజన సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
పిచరాగడి తాండలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు.. దళిత, గిరిజన సంఘాల హర్షం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి