Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / జహీరాబాద్

జహీరాబాద్ డీఎస్పీ, సీఐలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మానవ హక్కుల సంఘం బృందం

Updated : 22 Oct 2026 20:21 IST
As Preferred Source 1 min read
జహీరాబాద్ డీఎస్పీ, సీఐలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మానవ హక్కుల సంఘం బృందం

జహీరాబాద్ పట్టణ కేంద్రంలో గురువారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులు జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్. రవిని మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై. పండరి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు కొల్లూరు నాగేష్, జహీరాబాద్ డివిజన్ మహిళా రక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి బి. సుమిత్ర పాల్గొన్నారు.విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణకు పోలీసులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజాసేవే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందని తెలిపారు. పండుగలు ప్రజల మధ్య ఐకమత్యాన్ని, సోదరభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షిస్తూ పోలీసు అధికారులకు మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

జహీరాబాద్ డీఎస్పీ, సీఐలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మానవ హక్కుల సంఘం బృందం

Article Image

జహీరాబాద్ పట్టణ కేంద్రంలో గురువారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులు జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్. రవిని మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై. పండరి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు కొల్లూరు నాగేష్, జహీరాబాద్ డివిజన్ మహిళా రక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి బి. సుమిత్ర పాల్గొన్నారు.విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణకు పోలీసులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజాసేవే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందని తెలిపారు. పండుగలు ప్రజల మధ్య ఐకమత్యాన్ని, సోదరభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షిస్తూ పోలీసు అధికారులకు మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి