Sthanikam - Truth Matters
Logo

పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు...

Updated : 22 Oct 2026 21:31 IST
As Preferred Source 1 min read
పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు...

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం...

సమష్టి వ్యవసాయంతో మార్కెటింగ్‌ సౌకర్యాలు కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌...

నల్గొండ : పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు ప్రక్రియలో తూకం, ధరల విషయంలో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా చూడాలని, రైతులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న యాసంగి సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గురువారం మునుగోడు సమీపంలోని సల్సార్‌ బాలాజీ జిన్నింగ్‌ మిల్లులో ఏర్పాటు చేసిన కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన పత్తి నిల్వలు, కొనుగోళ్ల వివరాలు, తేమ శాతం, తూకం ప్రక్రియ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీసీఐ అధికారులు, రైతులు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో మాట్లాడి కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.

తూకం, ధరల్లో తేడాలొద్దు...

పత్తి విక్రయించేందుకు రైతులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే క్రమంలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ సూచించారు. పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించి, నిబంధనల ప్రకారం కొనుగోళ్లు నిర్వహించాలన్నారు. కొనుగోలు కేంద్రంలో రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, సీసీఐ రిజిస్టర్‌కు, జిన్నింగ్‌ మిల్లు రిజిస్టర్‌కు మధ్య ఎలాంటి తేడాలు ఉండకూడదని స్పష్టం చేశారు. తూకం, ధరల విషయంలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రైవేటు జిన్నింగ్‌ మిల్లులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే అధికంగా క్వింటాలు పత్తిని రూ.9,160 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు కలెక్టర్‌కు వివరించారు. రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి కూడా ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి...

అనంతరం కొనుగోలు కేంద్రం సమీపంలో ఉన్న పత్తి రైతులతో కలెక్టర్‌ మాట్లాడారు. వారు ఏ గ్రామం నుంచి వచ్చారు? ఎకరాకు ఎంత దిగుబడి వస్తోంది? గ్రామాల్లో భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉంది? గత యాసంగిలో ఏయే పంటలు సాగు చేశారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రానున్న యాసంగిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. జొన్నలు, సజ్జలు, పుచ్చకాయలు, కూరగాయలు వంటి తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మునుగోడు ప్రాంతంలో మినుములు, కుసుమ, ఆముదం వంటి పంటల సాగుకు అనుకూలమైన భూములు ఉన్నందున వాటి సాగుపైనా రైతులు దృష్టి సారించాలన్నారు.

సమష్టి సాగుతో మార్కెటింగ్‌ సౌకర్యాలు...

రైతులు సమష్టి వ్యవసాయం చేసేందుకు ముందుకొస్తే, వారు పండించిన పంటలకు తగిన మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించేలా జిల్లా యంత్రాంగం తరఫున చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. రైతులు పంట పండించిన వెంటనే విక్రయించుకునేలా మార్కెటింగ్‌ వ్యవస్థతో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. రైతులందరూ విడివిడిగా మార్కెట్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, పంటను ఒకచోట సేకరించి విక్రయించే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించాలని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌, జిల్లా సహకార అధికారి (డీసీఓ) మమత, మార్కెటింగ్‌ శాఖ ఏడీ ఛాయాదేవిలను ఆదేశించారు. వేసవిలో కూరగాయలు పండించే రైతులు వాటిని నిల్వ చేసుకునేందుకు అవసరమైన సదుపాయాలపై కూడా దృష్టి సారించాలన్నారు.

గోదాముల్లో చిరుధాన్యాల నిల్వకు ఏర్పాట్లు...

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గోదాములను చిరుధాన్యాల నిల్వకు అనువుగా సిద్ధం చేయాలని కలెక్టర్‌ సూచించారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో చిరుధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని, రైతులకు బిందు, తుంపర సేద్య పరికరాలను సబ్సిడీపై అందించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. స్వల్పకాలంలో దిగుబడి వచ్చే పంటల సాగుకు అవసరమైన విత్తనాలను కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు విత్తనాలు, సాగు సౌకర్యాలు కల్పించడంతో పాటు మార్కెటింగ్‌ అనుసంధానం, పంటల ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. రైతులు పంటలు పండించడానికే పరిమితం కాకుండా, వాటిని లాభదాయకంగా విక్రయించుకునే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌, మార్కెటింగ్‌ శాఖ ఏడీ ఛాయాదేవి, జిల్లా సహకార అధికారి మమత, సీసీఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు...

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి