Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

నీటి వృథాకు అడ్డుకట్ట! వృథా చేస్తే జరిమానా.. ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు.

Updated : 23 Oct 2026 08:48 IST
As Preferred Source 1 min read
నీటి వృథాకు అడ్డుకట్ట! వృథా చేస్తే జరిమానా.. ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు.

నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తాజ్‌పూర్‌ గ్రామ సర్పంచ్‌ ర్యాకల సంతోష శ్రీనివాస్‌ సూచించారు. నీటి కొరతను నివారించేందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, నల్లాలకు తప్పనిసరిగా ట్యాప్‌లు బిగించుకోవాలని కోరారు. నీటిని అనవసరంగా వృథా చేస్తే గ్రామపంచాయతీ నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్‌పూర్‌ గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుపై బుధవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్‌ ర్యాకల సంతోష శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో VBGRAMG ప్లాన్‌ ప్రక్రియలో భాగంగా నీటి కొరత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

నీటిని పొదుపుగా వినియోగించాలి

సమావేశానికి హాజరైన మండల ప్రత్యేక అధికారి శ్యాంసుందర్‌ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్‌లో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. విద్యుత్‌ను కూడా ఆదా చేయాలని కోరారు.

సొంత బోరుతో గ్రామానికి నీటి సరఫరా

గ్రామపంచాయతీ పరిధిలోని బోర్లలో నీటి లభ్యత తగ్గడంతో గత కొన్ని నెలలుగా తన సొంత వ్యవసాయ బోరు ద్వారా గ్రామానికి నీటిని సరఫరా చేస్తున్నట్లు సర్పంచ్‌ సంతోష శ్రీనివాస్‌ తెలిపారు. భవిష్యత్‌లో నీటి కొరత తలెత్తకుండా మరో ఇద్దరు రైతుల నుంచి రెండు బోర్లను అద్దెకు తీసుకున్నట్లు చెప్పారు. విద్యుత్‌ అధికారుల సహకారంతో నిరంతర విద్యుత్‌ సరఫరా అందుతుండటంతో నీటి సమస్య కొంతవరకు తగ్గిందన్నారు.

కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్యాంసుందర్‌, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీవో దినకర్‌, ఏపీవో బాలస్వామి, సామాజికవేత్త డా. ర్యాకల శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్‌రావు, ఉపసర్పంచ్‌ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు మహ్మద్‌ గాలిబీ యాకుబ్‌, బొమ్మారపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మి బాలరాజు, బీట్కూరు మహేష్‌, వరిగంటి మానస నాగరాజుతోపాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

నీటి వృథాకు అడ్డుకట్ట! వృథా చేస్తే జరిమానా.. ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి