చిట్యాల: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిట్యాల మున్సిపాలిటీ ఏడో వార్డుకు చెందిన పాల మల్లయ్య కుటుంబానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ అండగా నిలిచారు. మల్లయ్య మృతి వార్త తెలుసుకున్న ఆమె, బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం
మల్లయ్య కు నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి