వెలిమినేడులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అంశల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి కర్ధూరి అంజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ల యాదయ్య, ఉపాధ్యక్షుడు తాటికొండ సత్యనారాయణ, కోశాధికారి దేశబోయిన మల్లేష్, గౌరవ అధ్యక్షుడు చీమల వీరేశం, సీనియర్ నాయకులు అంతటి నర్సింహ, అంతటి సత్తయ్య, ఏనుగు సుధాకర్ రెడ్డి, గోలి గణేష్, బైకాని నాగరాజు, చిరగోని నర్సింహ, నాతి బిక్షమయ్య, సలహాదారు ఆరూరి నరసింహ, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు పబ్బు గిరిప్రసాద్, గోలి నరేష్ రజక తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి