రూ.2 లక్షల విలువైన పైపుల అందజేత.. ప్రజా సంక్షేమమే లక్ష్యమన్న సర్పంచ్ శ్యాంసుందర్.
చిట్యాల: గ్రామ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆరెగూడెం గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ అన్నారు. చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో గ్యాస్ కనెక్షన్లు కలిగిన 400 మంది లబ్ధిదారులకు రూ.2 లక్షల విలువైన గ్యాస్ పైపులను పంపిణీ చేశారు. సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జుంజు రాజు, వార్డు సభ్యులు రాచమల్ల మహేశ్, నాయకులు సాపిడి అశోక్, లడె శ్రీను, సిందే అంజనేయులు, ఎడ్డె ఉమేశ్, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి