బాల్యమిత్రుల ప్రగాఢ సంతాపం.
చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురానికి చెందిన కొమిడాల నర్సిరెడ్డి ఆదివారం మృతి చెందారు. నల్లగొండ పట్టణంలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నర్సిరెడ్డి మృతి వార్తతో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది.
నర్సిరెడ్డి అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం నల్లగొండ పట్టణంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల చిట్యాలకు చెందిన పలువురు బాల్యమిత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి