Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. చలో హైదరాబాద్‌ మహాధర్నాను జయప్రదం చేయండి: సీఐటీయూ.

Updated : 25 Oct 2026 20:22 IST
As Preferred Source 1 min read
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.  చలో హైదరాబాద్‌ మహాధర్నాను జయప్రదం చేయండి: సీఐటీయూ.

భువనగిరి, అక్టోబర్ 26: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాయ కృష్ణ పిలుపునిచ్చారు.

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, రెండో పీఆర్సీ ప్రకటించాలని, కనీస వేతనం రూ.42 వేలు నిర్ణయించాలని, డీఏ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు రూ.19,500 వేతనం ఇవ్వాలని, జీవో నంబర్ 1181ను రద్దు చేయాలని కోరారు. మరణించిన, అనారోగ్యానికి గురైన, ప్రమాదాల్లో మృతిచెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని, పట్టణాల విస్తరణకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహించే రాష్ట్రవ్యాప్త పోరాటంలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య, సీనియర్ నాయకులు ఊదరి రామచందర్, ఇటికల బిక్షపతి, రవి, సత్యమ్మ, సునీత, వర్మ, మంజుల, రేణుక, బాబు, ఆడెపు వెంకటేష్, శాంతికుమార్, రాణి, కిష్టమ్మ, కొండయ్య, రాజలింగం, యాదమ్మ, చల్ల రాజయ్య, రాజేష్, మల్లికార్జున తదితర మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news