కోదాడ, అక్టోబర్ 25 స్థానికం ప్రతినిధి :
జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం, హక్కుల పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలని టి జె డబ్ల్యు ఏ జాతీయ అధ్యక్షుడు శెట్టి అశోక్ పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడలోని వేమూరి సుధాకర్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి సహకారంతో నిర్వహించిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఆధునిక జర్నలిజం, డిజిటల్ మీడియా, వార్తల సేకరణ, ఫ్యాక్ట్ చెకింగ్‌పై శిక్షణ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్టులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీజెడబ్ల్యూ ఏ జాతీయ అధ్యక్షుడు శెట్టి అశోక్, జాతీయ ఉపాధ్యక్షురాలు వట్టికూటి భవాని, జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్, జాతీయ జాయింట్ సెక్రటరీ డి. సంగమేశ్వర్, జాతీయ కోశాధికారి కాసే అమృత, జాతీయ ప్రచార కార్యదర్శి కె. సంగమేశ్వర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కొండ మల్లేశం గౌడ్, గౌరవ సలహాదారు చినగోని రాఘవేంద్ర గౌడ్ పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పెటిక అభిలాష్, ఉపాధ్యక్షుడు బైరంట్ల క్రిష్ణ, ప్రధాన కార్యదర్శి వి.జె. కోలా, కార్యదర్శి మన్నె నాగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దె మల్లేష్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కంభంపాటి సోమయ్య, ఉపాధ్యక్షుడు శివదాసు శ్రీహరి, జిల్లా కార్యవర్గ సభ్యులు నర్రా ప్రమోద్ రెడ్డి, గుండ్రపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి