చిట్యాల: ఐదున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలతో సందడి చేశారు. చిట్యాల మండలం వెలిమినేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1971–72 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు.
సుమారు 55 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన మిత్రులు తమ పాఠశాల రోజులను గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడిపారు.
ఈ బ్యాచ్‌లో మొత్తం 40 మంది విద్యార్థులు ఉండగా, 12 మంది మృతి చెందడంతో వారి జ్ఞాపకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం పాత తరగతి గదులను సందర్శించి, చదువుకున్న రోజుల్లోని మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన పూర్వ విద్యార్థులు తమ జీవిత విశేషాలను పరస్పరం పంచుకున్నారు.
ఈ సమ్మేళనంలో ఇందిర, నిర్మల, మద్దెల మల్లయ్య, బొంతల అంజిరెడ్డి, ఉప్పరబోయిన స్వామి, ప్రతాప్, పెంటయ్య, పాండరి, రామలింగయ్య, రామచంద్రయ్య, సుధాకర్, శంకరయ్య, యాదగిరి, నారాయణ, బ్రహ్మచారి, పోతులూరు, నాగరాజుశర్మ, ఫరీద్, బిక్షమాచారి, రంగయ్య, మల్లారెడ్డి, ఈశ్వరయ్య, నరసింహారెడ్డి, యాదయ్య, కృపాసాగర్ రెడ్డి, నరేందర్ తదితరులు, గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి