Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

ఆర్టీఐ కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలి.సమాచార కమిషనర్‌కు ఆర్టీఐ రక్షక్ విజ్ఞప్తి.. ఆరు కీలక ప్రతిపాదనలు.

Updated : 24 Oct 2026 21:05 IST
As Preferred Source 1 min read
ఆర్టీఐ కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలి.సమాచార కమిషనర్‌కు ఆర్టీఐ రక్షక్ విజ్ఞప్తి.. ఆరు కీలక ప్రతిపాదనలు.

సమాచార హక్కు చట్టం అమలులో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని ఆర్టీఐ రక్షక్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్‌కు ఆరు కీలక ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో ఆర్టీఐ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ పేర్కొన్నారు. ఉత్తమ ఆర్టీఐ కార్యకర్తలకు అవార్డులు అందించాలని, సమాచార కమిషన్ సమావేశాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.

అలాగే విచారణల్లో పారదర్శకత పెంచడం, నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

సమాచార హక్కు చట్టం సమర్థవంతమైన అమలుకు సమాచార కమిషన్, ప్రభుత్వ అధికారులు, ఆర్టీఐ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు. ఆర్టీఐ రక్షక్ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ గౌరవ అధ్యక్షులు ఎం.డి. అష్రఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు లింగస్వామి, స్టేట్ మీడియా కన్వీనర్ ఆవనగంటి ఉపేందర్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి