కోదాడ పట్టణంలోని వై జంక్షన్ వద్ద ఈ నెల 26న రక్షణ వెల్ఫేర్ సొసైటీ ప్రారంభం కానుంది. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ దేశాల భూపాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు పోలంపల్లి సుజాత శనివారం వెల్లడించారు. పేదలకు సహాయం అందించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం సంస్థ ప్రధాన లక్ష్యాలని ఆమె తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ నెల 26న రక్షణ వెల్ఫేర్ సొసైటీ ప్రారంభం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి