Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

నారాయణగూడెంలో వీబీ–రాంజీ పనులపై డిప్యూటీ సీఈవో తనిఖీ

Updated : 24 Oct 2026 19:10 IST
As Preferred Source 1 min read
నారాయణగూడెంలో వీబీ–రాంజీ పనులపై డిప్యూటీ సీఈవో తనిఖీ

మునగాల మండలం నారాయణగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో చేపడుతున్న వీబీ–రాంజీ పనులను డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమం, కాలువల్లో పూడికతీత పనుల పురోగతిని తనిఖీ చేశారు. పనులకు హాజరవుతున్న కూలీలకు రోజుకు రూ.308 కూలీ లభించే విధానంపై అవగాహన కల్పించారు.

అనంతరం గ్రామంలో చేపట్టిన జలసిరి పనులను పరిశీలించి, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాంపాటి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో డి. నరేష్, టీఏ శ్రీధర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ వీరయ్య, మేట్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణగూడెంలో వీబీ–రాంజీ పనులపై డిప్యూటీ సీఈవో తనిఖీ

Article Image

మునగాల మండలం నారాయణగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో చేపడుతున్న వీబీ–రాంజీ పనులను డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమం, కాలువల్లో పూడికతీత పనుల పురోగతిని తనిఖీ చేశారు. పనులకు హాజరవుతున్న కూలీలకు రోజుకు రూ.308 కూలీ లభించే విధానంపై అవగాహన కల్పించారు.

అనంతరం గ్రామంలో చేపట్టిన జలసిరి పనులను పరిశీలించి, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాంపాటి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో డి. నరేష్, టీఏ శ్రీధర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ వీరయ్య, మేట్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి