Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

రైతు సమస్యలపై గళమెత్తుదాం.. జాతీయ మహాసభలను జయప్రదం చేద్దాం

Updated : 24 Oct 2026 19:10 IST
As Preferred Source 1 min read
రైతు సమస్యలపై గళమెత్తుదాం.. జాతీయ మహాసభలను జయప్రదం చేద్దాం

అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బుర్రి శ్రీరాములు పిలుపునిచ్చారు. శనివారం మునగాలలోని సుందరయ్య భవనంలో చందా చంద్రయ్య అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నవంబర్ 15 నుంచి 18 వరకు నల్గొండలో జరిగే మహాసభలకు మండలం నుంచి 2 వేల మంది రైతులను సమీకరించాలని తెలిపారు. నవంబర్ 5 నుంచి గ్రామాల్లో ప్రచారం నిర్వహించి రైతులకు మహాసభల లక్ష్యాలను వివరించాలన్నారు. వర్షపాతం లోటుతో ఎండిపోయిన వరి, పత్తి తదితర పంటలకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం మండల కార్యదర్శి దేశిరెడ్డి స్టాలిన్‌రెడ్డి, సీఐటీయూ మండల కన్వీనర్ బచ్చలకూర స్వరాజ్యం, నాగిరెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతు సమస్యలపై గళమెత్తుదాం.. జాతీయ మహాసభలను జయప్రదం చేద్దాం

Article Image

అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బుర్రి శ్రీరాములు పిలుపునిచ్చారు. శనివారం మునగాలలోని సుందరయ్య భవనంలో చందా చంద్రయ్య అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నవంబర్ 15 నుంచి 18 వరకు నల్గొండలో జరిగే మహాసభలకు మండలం నుంచి 2 వేల మంది రైతులను సమీకరించాలని తెలిపారు. నవంబర్ 5 నుంచి గ్రామాల్లో ప్రచారం నిర్వహించి రైతులకు మహాసభల లక్ష్యాలను వివరించాలన్నారు. వర్షపాతం లోటుతో ఎండిపోయిన వరి, పత్తి తదితర పంటలకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం మండల కార్యదర్శి దేశిరెడ్డి స్టాలిన్‌రెడ్డి, సీఐటీయూ మండల కన్వీనర్ బచ్చలకూర స్వరాజ్యం, నాగిరెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి