సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న సాయిబాబా ఆలయానికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన రజతోత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి సహకారంతో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, యజ్ఞయాగాలు నిర్వహించారు. కూకట్‌పల్లికి చెందిన నరేష్ పంతులు నేతృత్వంలో 30 మంది వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.మొదటి రోజు సుదర్శన యాగం, రెండో రోజు శత కలశాభిషేకం, మూడో రోజు శిఖర కుంభాభిషేకం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమాలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శనివారం నిర్వహించిన శిఖర కుంభాభిషేకంలో నిర్మల జగ్గారెడ్డి పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్యులు టీ. కాశప్ప, కేవీ నర్సయ్య, ఎస్. వీరేందర్, ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
సాయిబాబా ఆలయ రజతోత్సవాల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి