కోదాడలో పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలను పురస్కరించుకుని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అమరవీరుడు కానిస్టేబుల్ శీలం కమలాకర్ కుటుంబ సభ్యులను శనివారం కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కమలాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. నాగారం పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీల సమయంలో కారు ఢీకొనడంతో కమలాకర్ గతేడాది నవంబర్‌లో మృతి చెందినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మల్సూర్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ పాల్గొన్నారు.
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులకు ఘన నివాళి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి