గంజాయి స్మగ్లర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన గురుజావాడ గ్రామానికి చెందిన సురేష్‌కు జహీరాబాద్ సీఐ రవి, కోహిర్ ఎస్సై నరేష్ ఘనంగా నివాళులర్పించారు. సురేష్ నివాసానికి వెళ్లిన పోలీసు అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2010లో నాగూర్ గ్రామ శివారులో గంజాయి స్మగ్లర్ల దాడిలో సురేష్ హత్యకు గురయ్యారు. ఈ ఘటన అప్పట్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబానికి అండగా ఉన్న కుమారుడిని కోల్పోయిన సురేష్ కుటుంబ సభ్యులు, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అమరుడు సురేష్‌కు సీఐ రవి,ఎస్సై నరేష్ ఘన నివాళి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి