Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

చౌటుప్పల్‌ హైవే విస్తరణలో అలసత్వం!

Updated : 24 Oct 2026 21:05 IST
As Preferred Source 1 min read
చౌటుప్పల్‌ హైవే విస్తరణలో అలసత్వం!

మూడ్రోజుల్లో జంక్షన్‌ అన్నారు.. వారమైనా ఊసే లేదు!

రోడ్డు దాటేందుకు నానా తంటాలు పడుతున్న స్థానికులు

చౌటుప్పల్‌ స్థానికం ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో సాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు స్థానికులకు, వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. పనుల్లో భాగంగా పాత జంక్షన్లను మూసివేస్తున్న అధికారులు.. పాదచారులు, వాహనాలు సురక్షితంగా రోడ్డు దాటేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.​ఈ సమస్యపై అడ్వకేట్ చెరుకు శివకుమార్ గౌడ్ స్థానికులతో కలిసి ధర్నా చేపట్టడంతో అధికారులు స్పందించారు. అఖిలపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో.. చిన్నకొండూరు వద్ద మూడ్రోజుల్లో జంక్షన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఇబ్బందుల దృష్ట్యా కొద్ది నెలలపాటు ట్రాఫిక్ చలాన్ల మినహాయింపు ఇవ్వాలని మున్సిపల్ చైర్మన్ కోరారు. ​అయితే హామీ ఇచ్చి వారం గడిచినా జంక్షన్ ఏర్పాటు ఆచరణకు నోచుకోలేదు. కేవలం హామీలకే పరిమితమవుతున్నారని, ప్రత్యామ్నాయ మార్గాలు లేక నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే జంక్షన్‌ను అందుబాటులోకి తేకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Sthanikam

చౌటుప్పల్‌ హైవే విస్తరణలో అలసత్వం!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి