Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పల్లివాడ ఘటనపై రాజకీయం.. చిరుమర్తి తీరుపై కాంగ్రెస్ నేతల ఫైర్‌!

Updated : 25 Oct 2026 15:02 IST
As Preferred Source 1 min read
పల్లివాడ ఘటనపై రాజకీయం.. చిరుమర్తి తీరుపై కాంగ్రెస్ నేతల ఫైర్‌!

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నాపై మాజీ సర్పంచ్‌ల ఫోరం నేత గంగుల రాజిరెడ్డి విమర్శలు

రామన్నపేట, అక్టోబర్ 25:

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగడం విడ్డూరంగా ఉందని మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గంగుల వెంకట రాజిరెడ్డి విమర్శించారు. పల్లివాడలో మహిళపై దాడి ఘటనను రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం లక్ష్యమని పేర్కొన్నారు.

మహిళపై దాడి హేయమైన చర్య

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడలో దుర్గామాత నిమజ్జనం సందర్భంగా మద్యం మత్తులో మహిళపై బీరు సీసాతో దాడి చేయడం హేయమైన చర్య అని నాయకులు పేర్కొన్నారు. వైన్స్‌ షాపు ఎదుట దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై చిరుమర్తి లింగయ్య తన అనుచరులతో పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేయడాన్ని గంగుల రాజిరెడ్డి తప్పుబట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం సరికాదని విమర్శించారు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించొద్దు

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గతంలోనూ మండలంలో చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారని పున్న జగన్మోహన్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి విమర్శించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం, బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. మహిళపై దాడి ఘటనతో గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని, ఇలాంటి ఘటనలను రాజకీయాలకు అతీతంగా ఖండించాలని పేర్కొన్నారు.

Sthanikam

పల్లివాడ ఘటనపై రాజకీయం.. చిరుమర్తి తీరుపై కాంగ్రెస్ నేతల ఫైర్‌!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news