ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు, ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ చైర్మన్ డా. ర్యాకల శ్రీనివాస్ కోరారు. 2023 నవంబర్ 1 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు నిండిన వారు ఓటు నమోదుకు అర్హులని తెలిపారు. అర్హులు ఫారం-18 ద్వారా అవసరమైన ధ్రువపత్రాలతో నవంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పట్టభద్రుల సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించే ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు. ప్రతి అర్హుడూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని డా. ర్యాకల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి