Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ధనుష్ గౌడ్‌కు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి దంపతుల ఆశీస్సులు

Updated : 25 Oct 2026 19:53 IST
As Preferred Source 1 min read
ధనుష్ గౌడ్‌కు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి దంపతుల ఆశీస్సులు

స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపిన మునుగోడు ఎమ్మెల్యే

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగోని మౌనిక-రమేష్ గౌడ్ కుమారుడు పెద్దగోని ధనుష్ గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మీ దంపతులను కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధనుష్‌ గౌడ్‌కు ఎమ్మెల్యే దంపతులు తీపి తినిపించి ఆప్యాయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ​అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ధనుష్‌ గౌడ్ విద్యలో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులకు, కుటుంబానికి సత్కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనసారా దీవించారు.

​పుట్టినరోజు వేడుకల వేళ ఎమ్మెల్యే దంపతులు చూపిన ఆప్యాయత, అందించిన ఆశీర్వాదాల పట్ల పెద్దగోని మౌనిక-రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు పాల్గొని ధనుష్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ధనుష్ గౌడ్‌కు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి దంపతుల ఆశీస్సులు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news