నారాయణఖేడ్ పట్టణంలోని అంబేడ్కర్ భవనంలో ఆదివారం అంబేడ్కర్ భవనం ఇన్‌చార్జి భీమసేన, విశ్వనాథ్ సమక్షంలో ఉపాధ్యాయుడు అంబాజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు,ఉపాధ్యాయులు కలిసి కేక్ కట్ చేసి అంబాజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం శాలువాతో సన్మానించి ఆయనకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండారి,మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాజ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ చిరంజీవి, మాల మహానాడు నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడు విశ్వనాథ్, భీమసేన,లక్ష్మణ్‌తో పాటు ఉపాధ్యాయులు స్వామిదాస్,సంగ్ శెట్టి, ఎంఐఎస్ రాహుల్ తదితరులు పాల్గొని అంబాజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధ్యాయుడు అంబాజీకి ఘన సన్మానం.. జన్మదిన శుభాకాంక్షలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి